ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్: పూర్తి షెడ్యూల్
మరో ప్రపంచ టెస్ట్ క్రికెట్ సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఇంగ్లండ్ లోని సౌతాంఫ్టన్ వేధికగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ జరుగబోతోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ప్రతిష్టాత్మక ఈ చాంపియన్ షిప్ ఫైనల్ కు మరో వారం మాత్రమే టైం ఉంది. ఈ టైటిల్ కోసం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లలో అత్యధిక విజయాలతో భారత మొదటి స్థానంలో నిలవగా.. న్యూజిలాండ్ రెండో స్థానం దక్కించుకుంది. దీంతో ఈ రెండు టాప్ 2 జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఈనెల 18 నుంచి ఇంగ్లండ్ లో జరుగబోతోంది. 18న మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాత్రి 11.30 గంటలకు మ్యాచ్ ముగిస్తుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈరోజు నుంచి సాధన మొదలుపెట్టారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. సాయంత్రం పూటనే ఈ మ్యాచ్ ఉండడంతో ఇండియాలో ఈ లాక్ డౌన్ వేళ మ్యాచ్ చూసేందుకు అందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ చానెల్ భారత్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. స్థానిక భాషల్లోనూ...